Ad Code

10 మెగాపిక్సెల్స్‌తో శాంసంగ్ గ్యాలక్సీ జెడ్ ఫోల్డ్‌ 6 !


శాంసంగ్ గ్యాలక్సీ జెడ్ ఫోల్డ్‌6 పేరుతో మడతపెట్టే కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో అధునాతన ఫీచర్లను అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 12జీబీ ర్యామ్‌, 1 టీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ అక్షరాల రూ. 2,00,999కావడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోన్‌ను పలు బ్యాంకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 15 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 వంటి పవర్ ఫుల్‌ ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 2 లిథియం బ్యాటరీలను అందించారు. ఈ ఫోన్‌లో ఫోల్డబుల్ డైనమిక్‌ ఎల్‌టీపీఓ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 7.6 ఇంచెస్‌తో స్క్రీన్‌ ఈ ఫోన్‌ సొంతం. అలాగే 6.3 ఇంచెస్‌తో కూడిన కవర్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌, 10 మెగాపిక్సెల్‌, 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 10 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. సెక్యూరిటీ పరంగా చూస్తే సౌడ్‌ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌ను ఇచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu