Ad Code

సెప్టెంబర్ 30లోగా సీఎంఆర్ అందించాలి : ఉత్తమ్ కుమార్ రెడ్డి


తెలంగాణలోని నల్గొండ కలెక్టరేట్ ప్రభుత్వం విధించిన గడువు సెప్టెంబర్ 30 లోగా మిగిలిన సీఎంఆర్ ను పూర్తిగా అందించాలని, అందుకు కావలసిన చర్యలను పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్ తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్లు, డీఎస్ఓ లు, డిఎం లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 2022-23 రబి, అదేవిధంగా 2023- 24 కు సంబంధించి సీఎంఆర్ డెలివరీ పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఫాల్టర్ గా ఉన్న రైస్ మిల్లర్ల నుండి రావాల్సిన బకాయిలను ప్రభుత్వ నిబంధనలకు లోబడి త్వరితగతిన రాబట్టాలని సూచించారు. నెల గడువులోగా రబి 2022 - 23 ధాన్యం సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. రాబోయే ఖరీఫ్ 2024-25 రైతుల నుండి ధాన్యసేకరణకు తగిన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిఎస్ఓ వెంకటేశ్వర్లు, డి ఎ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu