Ad Code

ఆండ్రాయిడ్ 4, iOS 11 కంటే ముందు వెర్షన్‌ ల ఫోన్ లకు వాట్సాప్ సేవల నిలిపివేత ?


చాలా మంది వాట్సాప్ వినియోగదారులు పాత సాఫ్ట్ వేర్ ని ఉపయోగిస్తున్నారు. న్యూ వర్షన్లను అప్డేట్ చేసుకోకుండా పాత వర్షన్ లను ఉపయోగిస్తున్నారు. అయితే అలాంటి డివైజ్ లలో వాట్సాప్ తన సేవలను నిలిపివేస్తోంది. వాట్సాప్ కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదేం మొదటి సరికాదు. గతంలో ఇలాంటి నిర్ణయాన్ని చాలాసార్లు కంపెనీ తీసుకున్న విషయం తెలిసిందే. వాట్సాప్ వినియోగదారుల గొప్యత అలాగే భద్రత విషయాలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి నిర్ణయాలను ఎప్పటికప్పుడు తీసుకుంటోంది. అయితే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న వాట్సాప్ సంస్థ తాజాగా మరో నిర్ణయం తీసుకుందట. ముఖ్యంగా ఆ లిస్టులో మీరు కూడా ఉంటే అప్రమత్తంగా ఉండాలని అలాగే మీ బ్యాకప్ ని సిద్ధం చేసుకోవాలని సూచిస్తోంది. పాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్‌ లలో వాట్సాప్‌ ను ఉపయోగిస్తున్న చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ ఉన్నారు. ఆండ్రాయిడ్ 4, iOS 11 కంటే ముందు వెర్షన్‌ లు నడుస్తున్న ఫోన్‌ ల నుండి వాట్సాప్ తన మద్దతును ఉపసంహరించుకుంది. ప్రస్తుతం, వాట్సాప్ ఆండ్రాయిడ్ 5 లేదా iOS 11 కంటే ఎక్కువ వెర్షన్‌లు కలిగిన ఫోన్‌లకు మాత్రమే మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్ పేరును వాట్సాప్ ప్రస్తావించలేదు. అయితే CanalTech అనే వెబ్‌సైట్ ప్రకారం, జాబితాలో 35 స్మార్ట్‌ ఫోన్‌లు ఉన్నాయి. ఆ ఫోన్ లలో వాట్సాప్ ఫీచర్ ఆగిపోయింది. ఇందులో ఆపిల్ , శాంసంగ్ , Huawei, మోటారోలా స్మార్ట్‌ఫోన్‌ ల పేర్లు కూడా ఉన్నాయి.


Post a Comment

0 Comments

Close Menu