Ad Code

ఆగస్టు 5న ఇన్ఫినిక్స్ నోట్ 40 ఎక్స్ 5జి విడుదల !

దేశీయ మార్కెట్లో ఆగస్టు 5న ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్ 40 ఎక్స్ 5జి ని లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ గొప్ప పెర్ఫార్మెన్స్ , అధిక స్టోరేజ్ తో తీసుకొస్తున్నట్లు తెలిపింది. 12GB ర్యామ్, 256GB హెవీ స్టోరేజ్ తో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. అందుకే, ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీని అందించి టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన మైక్రో సైట్ పేజ్ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ను వెల్లడించింది. ఇన్ఫినిక్స్ నోట్ 40X 5జి ఫోన్ చాలా నాజూకైన డిజైన్ తో వుంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో 108MP ప్రధాన కెమెరా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ లో ముందు సెంటర్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కలిగిన పెద్ద డిస్ప్లే ఉన్నట్లు ఇమేజ్ ల ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ లో స్టోరేజ్ ను మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చని కూడా ప్రకటించింది. AI Camera ఫీచర్స్ తో అందిస్తున్నట్లు కూడా ఇన్ఫినిక్స్ తెలిపింది. ఇందులో ఇమేజ్ ఎన్హెన్స్ తో పాటు AI స్కై షాప్ వంటి చాలా ఫీచర్స్ మరియు ఫిల్టర్స్ ఉన్నాయని కూడా చెబుతోంది. అలాగే, AI వాల్ పేపర్ జెనరేటర్, AI APP బూస్ట్ మరియు మరిన్ని AI ఫీచర్స్ ఉన్నాయని కూడా తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu