Ad Code

గూగుల్ క్రోమ్‌లో సెక్యూరిటీ సమస్యలు !


గూగుల్ క్రోమ్‌లో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆగస్టు 29న పేర్కొంది. ఇది చాలా ప్రమాదకరమైన సమస్య అని చెప్పింది. "గూగుల్ క్రోమ్‌లో చాలా సమస్యలు కనిపించాయి. ఈ సమస్యలను ఉపయోగించి హ్యాకర్లు టార్గెటెడ్ కంప్యూటర్‌లో ఆర్బిట్రరీ కోడ్‌ రన్ చేయవచ్చు. ఈ సమస్యలను 'V8లో టైప్ కన్ఫ్యూజన్', 'స్కియాలో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో' అని పిలుస్తారు." అని CERT-In సెక్యూరిటీ బులిటెన్‌ తెలిపింది. V8లో టైప్ కన్ఫ్యూజన్ అనేది కంప్యూటర్ ప్రోగ్రామ్‌లో ఒక రకమైన తప్పు. హ్యాకర్లు సెక్యూరిటీని బైపాస్ చేసి ఈ సమస్యతో ప్రోగ్రామ్‌ను తమకు అనుకూలంగా మార్చగలరు. "స్కియాలో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో" ఇది కూడా ఒక రకమైన తప్పు. ఈ తప్పు వల్ల హ్యాకర్లు కంప్యూటర్‌లోని సమాచారాన్ని మార్చగలరు లేదా దొంగతనం చేయగలరు. అలానే హ్యాకర్లు యూజర్లను ఒక మాలిషియస్ వెబ్‌సైట్‌కి విజిట్ చేసేలా మోసం చేస్తారు. ఆ వెబ్‌సైట్‌కి వెళ్తే కంప్యూటర్‌లోకి మాల్వేర్ లేదా వైరస్ సోకవచ్చు. విండోస్, మ్యాక్OS, లైనెక్స్ కంప్యూటర్‌లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతుంటే, బ్రౌజర్ వెర్షన్ ఏదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ కింది వెర్షన్లను వాడుతుంటే వెంటనే లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. విండోస్‌లో 128.0.6613.113/.114 కంటే ముందు వెర్షన్లు, మ్యాక్‌లో 128.0.6613.113/.114 కంటే ముందు వెర్షన్లు, లైనెక్స్‌లో 128.0.6613.113 కంటే ముందు వెర్షన్లపై నడుస్తున్న కంప్యూటర్లకు రిస్కు చాలా ఎక్కువ. వీరు లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓల్డ్ వెర్షన్ అయితే, దాన్ని వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి. అందుకు క్రోమ్‌లో ఉన్న త్రీ డాట్ ఐకాన్స్‌పై క్లిక్ చేసి, సెట్టింగ్స్ > అబౌట్ క్రోమ్ ఆప్షన్‌కి వెళ్లాలి. అప్‌డేట్ అందుబాటులో ఉంటే, అక్కడ "అప్‌డేట్ క్రోమ్" ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి బ్రౌజర్ అప్‌డేట్ చేసుకోవచ్చు. గూగుల్ లేటెస్ట్ వెర్షన్‌లో చాలా సమస్యలను సరి చేసింది. ప్రతి సమస్యను అలా కొత్త అప్‌డేట్స్‌తో ఫిక్స్ చేస్తుంది. అందుకే బ్రౌజర్‌ని ఎప్పటికప్పుడు అప్-టు డేటెడ్‌గా ఉంచుకోవాలి.

Post a Comment

0 Comments

Close Menu