Ad Code

వీధుల్లో మొసలి సంచారం !


త్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాకు చెందిన ఓ వీడియోలో వీధుల్లో మొసలి పాకుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈరోజు ఉదయం నంగల్ సోటి గ్రామంలోని వీధుల్లో ఓ ముసలి షికారు చేస్తూ కనిపించింది. మొసలి గ్రామ వీధుల్లోకి ప్రవేశించి స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. అయితే మొసలి మాత్రం ఎవరికీ హాని తలపెట్టకుండా వీధిలో పాకుతూ వెళ్లడం వీడియోలో చూడొచ్చు. వీడియోలో ఓ వ్యక్తి మొసలి దగ్గరకు వెళ్లి దానిని కాలితో తన్నడం కనిపిస్తుంది. కానీ మొసలి ఏం పట్టించుకోకుండా, దాని మానాన అది వెళ్లడం చూడొచ్చు. ఉత్తరప్రదేశ్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో వరద ప్రవాహానికి ఓ మొసలి దారి తప్పి జనావాసంలోకి ప్రవేశించింది. ఈ రోజు ఉదయం తెల్లవారు జామున వీధి కుక్కలు అరుస్తుండటంతో స్థానికులు రోడ్డుపైకి వచ్చి చూడగా వారికి మొసలి కనిపించింది. గ్రామంలో మొసలి దాదాపు 3 గంటలపాటు సంచరించింది. గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సమాచారం అందిన రెండు గంటల తర్వాత వారు గ్రామానికి చేరుకుని మొసలిని పట్టుకుని వెళ్లారు.

Post a Comment

0 Comments

Close Menu