Ad Code

అంజీర్ (అత్తి పండు) - ఉపయోగాలు !


అంజీర్ ని అత్తి పండ్లు అని కూడా అంటారు. ఈ డ్రై ఫ్రూట్ తినటానికి రుచిగా ఉండటమే కాక దీనిలో కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఈ పోషకాలు అన్నీ కూడా ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ పండ్ల ను తీసుకోవటం వలన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. వీటిని ఉదయం పూట తీసుకోవటం వలన దీనిలో ఉన్న సహజ చక్కెర మనకు తొందరగా శక్తి ని ఇస్తుంది. అలాగే జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక ఈ అంజీర్ ను ఉదయం పూట తీసుకోవటం వలన జీర్ణ వ్యవస్థ అనేది ఎంతగానో మెరుగుపడుతుంది.ఇది ఆకలిని కూడా తగ్గిస్తుంది. అయితే రోజంతా అతిగా ఆహారం తీసుకునే అలవాటు ఉన్నవారు ఈ డ్రై ఫ్రూట్ తీసుకోవడం వలన ఆకలిని నియంత్రిస్తుంది. అలాగే ఈ అంజీర్ లో మెగ్నీషియం అనేది పుష్కలంగా ఉంటుంది. ఈ డ్రైఫ్రూట్ ను సాయంత్రం తీసుకోవడం వలన కండరాలు అనేవి ఎంతో విశ్రాంతి పొందుతాయి. దీంతో మంచి నిద్ర అనేది పడుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఈ అంజీర్ పండ్లు ఎంతో ఉపయోగపడతాయి. అలాగే రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. అంతేకాక గుండె సమస్యల ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది. అయితే ఎముకల ఆరోగ్యానికి దీనిలో ఉన్న క్యాల్షియం మరియు పాస్పరస్ ఎముకల సాంద్రతను కూడా పెంచుతుంది. అయితే అధిక బరువుతో ఇబ్బంది పడేవారు ఈ అంజీర్ ను సాయంత్రం తీసుకుంటే బరువు తగ్గే అవకాశం ఉన్నది. ఈ పండ్లలో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. అలాగే జీర్ణ ఆరోగ్యాన్ని ఎంతగానో పెంచుతుంది. అలాగే మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. దీని లో ఉన్న విటమిన్లు మరియు ఖనిజాలు మొత్తం ఆరోగ్యానికి కావలసిన విటమిన్ ఏ ఇ కే, పొటాషియం, మెగ్నీషియం కూడా ఉన్నాయి.అలాగే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి శరీరంలోని ఆక్సికరణ ఒత్తిడిని మరియు వాపును నియంత్రిస్తాయి. 

Post a Comment

0 Comments

Close Menu