Ad Code

వచ్చే నెలలో భారీగా వర్షాలు !


సెప్టెంబర్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దేశంలో దీర్ఘకాల సగటు 167.9 మిల్లీ మీటర్లలో 109 శాతం వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మోహపాత్ర పేర్కొన్నారు. వాయువ భారత్‌, పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్చువల్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో సహా వాయువ్య ప్రాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందదన్నారు. వాయువ్య భారతంలోని కొన్ని, దక్షిణ ద్వీపకల్పంలోని అనేక ప్రాంతాలు, ఉత్తర బీహార్, ఈశాన్య ఉత్తరప్రదేశ్, అలాగే ఈశాన్య భారతదేశంలో చాలా వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది ఐఎండీ చీఫ్‌ వెల్లడించారు. రుతుపవన ద్రోణి సాధారణ స్థితిలోనే ఉంటుందని, బంగాళాఖాతంలో పలు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. పశ్చిమ-వాయువ్య దిశగా రాజస్థాన్‌ వరకు.. ద్రోణి హిమాలయాల వైపు సైతం వెళ్లవచ్చని తెలిపారు. సెప్టెంబరులో ఈ ప్రాంతాన్ని వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌ ప్రభావితం చేసే అవకాశం ఉందని మోహపాత్ర తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu