Ad Code

వన్‌ప్లస్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ఓపెన్‌ అపెక్స్‌ ఎడిషన్‌ అమ్మకాలు ప్రారంభం !


న్‌ప్లస్‌ వైబ్‌సైట్‌లో వన్‌ప్లస్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ఓపెన్‌ అపెక్స్‌ ఎడిషన్‌ ఉదయం 10 గంటలకు ప్రారంభం అయింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానుంది. క్రిమ్సన్‌ షాడో రంగుల్లో లెదర్‌ ప్యానల్‌తో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ గరిష్ఠంగా 64MP కెమెరాను కలిగి ఉంది. కేవలం ఒకే వేరియంట్‌లో లాంచ్‌ చేశారు. వన్‌ప్లస్‌ ఒపెన్‌ అపెక్స్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ 16GB ర్యామ్ + 1TB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లోనే అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.1,49,999 గా ఉంది. వన్‌ప్లస్‌ వైబ్‌సైట్‌ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌పై స్పెషల్‌ డిస్కౌంట్‌తో రూ.10,000 తగ్గింపును పొందవచ్చు. మరియు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా గరిష్ఠంగా రూ.20,000 డిస్కౌంట్‌ పొందవచ్చు. మరియు ఎక్స్చేంజీ బోనస్‌లో భాగంగా రూ.8000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్‌ ఓపెన్‌ అపెక్స్ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ 2268*2440 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 7.82 అంగుళాల 2K ఫ్లెక్సీ ఫ్యూయిడ్‌ LTPO 3.0 అమోలెడ్‌ ఇన్నర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 6.31 అంగుళాల 2K LTPO 3.0 సూపర్‌ ఫ్లూయిడ్‌ అమోలెడ్‌ కవర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OxygenOS 14 పైన పనిచేస్తుంది. మరియు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 16GB LPDDR5X ర్యామ్ మరియు 1TB UFS 4.0 అంతర్గత స్టోరేజీ తో ఉంది. 16GB ర్యామ్‌ + 1TB స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.  Hasselblad బ్రాండ్‌ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 48MP సోనీ LYT T808 CMOS ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్‌ జూమ్‌, 6X ఇన్‌ సెన్సార్‌ జూమింగ్‌తో 6X 64MP Omnivision OV648 కెమెరాను కలిగి ఉంది. మరియు 48MP సోనీ IMX581 వైడ్‌ యాంగిల్‌ కెమెరానుతో విడుదల చేశారు. 20MP, 32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. 67W సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్టుతో 4805mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ VIP మోడ్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ మోడ్‌ లో కెమెరా, మైక్రోఫోన్‌ సహా మరికొన్ని ఫీచర్‌లను వినియోగించే అవకాశం ఉండదు. భద్రతపరంగా ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. మరియు ఫేస్ అన్‌లాక్‌, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ వంటి సెక్యూరిటీ ఫీచర్‌లు ఉంటాయి. 5G, 4G LTE, వైఫై 7, బ్లూటూత్‌ 5.3, GPS, Galileo, A-GPS, Glonass, Beidou, USB-C ఛార్జింగ్‌ పోర్టులను కలిగి ఉంటుంది. యాక్సిలిరోమీటర్‌, గైరోస్కో్ప్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌, e-కాంపాస్‌, ఫ్లిక్‌ డిటెక్ట్‌ సెన్సార్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌ వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉంది.

Post a Comment

0 Comments

Close Menu