Ad Code

పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్ ఫొగట్‌పై అనర్హత వేటు ?


పారిస్ ఒలింపిక్స్ 2024లో వినేష్ ఫొగట్ చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. పతకాన్ని ఖాయం చేసుకున్నారు. గోల్డ్ మెడల్ కోసం నేడు ఫైనల్స్‌లో తలపడబోతున్నారు. అమెరికాకు చెందిన రెజ్లర్ సారా హిండెబ్రాండ్‌ను ఢీ కొట్టబోతోన్నారు. ఫైనల్స్‌ ఆడటానికి కొద్దిసేపటి ముందు షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఆమె అనర్హతకు గురైనట్లు ప్రచారం జరుగుతోంది. వినేష్ ఫొగట్‌ డిస్‌క్వాలిఫై అయ్యారనే ప్రచారం మీడియాలో ముమ్మరంగా సాగుతోంది. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందనే విషయం ఇంకా తెలియరావట్లేదు. అధిక బరువు కారణంగా వినేష్ ఫొగట్‌పై అనర్హత వేటు పడిందని చెబుతున్నారు. మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఆమె పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇందులోనే ఆమె ఫైనల్స్‌లో అడుగుపెట్టగలిగారు. పతకాన్ని ఖాయం చేసుకోగలిగారు. ఫైనల్స్ ఓడినా వెండి పతకం మాత్రం ఖాయం. ఈ పరిస్థితుల్లో అధిక బరువు కారణంగా ఆమెపై వేటు పడిందనే ప్రచారం జరుగుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కేటగిరిలో ఆడే రెజ్లర్ 50 కేజీలు, లేదా అంతకంటే తక్కువ శరీర బరువును కలిగి ఉండాలి. వినేష్ ఫొగట్ మాత్రం 50 కేజీలకు మించి బరువును కలిగి ఉన్నారని, అదే అనర్హత వేటుకు కారణమైందని అంటున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu