Ad Code

తగ్గనున్న గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ?


సెప్టెంబర్‌ 1న గ్యాస్‌ సిలిండర్‌ ధరలతో పాటు ఇంధన ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట!. ఈ మేరకు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్‌ 1 నుంచి ఇంటి అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.50,వాణిజ్య సిలిండర్ల ధర రూ.60 నుంచి రూ.70 వరకు తగ్గుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఆగస్టులో బిజినెస్-గ్రేడ్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధర రూ.8.50 పెరిగింది, జూలైలో రూ.30 తగ్గింది. ఇక గతేడాది రాఖీ, ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్‌ ఎల్‌పీజీ సిలిండర్ ధరను 300 రూపాయలు తగ్గించింది. ఇప్పుడు దాని ధర మరో రూ.50 తగ్గితే, రూ.760 రూపాయలకే అందుబాటులో ఉంటుంది. రాయితీని సద్వినియోగం చేసుకుంటే రూ.460కే సిలిండర్‌ని ఇంటికి తీసుకెళ్లవచ్చు. పీఎం ఉజ్వల యోజన ఇప్పటికే ఎల్‌పీజీ సిలిండర్‌లపై రూ.300 రాయితీ అందిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం గ్యాస్‌ సిలిండర్‌ రేట్లతో పాటుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కూడా తగ్గించనున్నట్లు సమాచారం. పెట్రోల్‌ లీటర్‌పై రూ.6, డీజిల్‌ లీటర్‌పై రూ.5 వరకు తగ్గనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu