Ad Code

డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు రాయితీ పై ఎలక్ట్రిక్ సైకిళ్లు ?


ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు రాయితీ పై ఎలక్ట్రిక్ సైకిళ్లు అందించే ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ ప్రతినిధులతో సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ కంపెనీ భారీ ఎత్తున ఎలక్ట్రిక్ సైకిళ్లను ఉత్పత్తి చేస్తుంది. వాటిని విద్యార్థులు, డ్వాక్రా మహిళలు తక్కువ ధరకు పొందగలరు. ఆ రాయితీ భారాన్ని ఏపీ ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ఎలక్ట్రిక్ సైకిల్ పర్యావరణానికి హాని చేయవు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదల కోసం నిర్మించే ఇళ్లకు ఇంధన సామర్ధ్య విద్యుత్ పరికరాలను సబ్సిడీ పై ఇవ్వాలని సీఎం ఆలోచనలు చేస్తున్నారు. తద్వారా పేదలకు నాణ్యమైన విద్యుత్ పరికరాలు తక్కువ ధరకే పొందగలరు. అలాగే సీఎం చంద్రబాబు ప్రభుత్వ భవనాల్లో సోలార్ విద్యుత్‌ని వాడేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎలక్ట్రిక్ వస్తువుల్ని సబ్సిడీకి ఇస్తామని సీఎం చెప్పారు. 

Post a Comment

0 Comments

Close Menu