Ad Code

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం


బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావం వల్ల అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. దీనివల్ల రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిసా, ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలో ఉంది. గురువారం అన్నమయ్య, శ్రీసత్యసాయి, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపాను సుడి ఉండటంతో అది క్రమంగా బలపడుతుందని అధికారులు తెలియజేస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu