Ad Code

థానేలో కూలిన హోర్డింగ్‌ కూలి వాహనాలు ధ్వంసం


హారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షానికి థానే జిల్లాలో ఓ హోర్డింగ్‌ కూలి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కల్యాణ్‌ ప్రాంతంలో శుక్రవారం ఉదయం 10:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ రద్దీగా ఉండే సహజానంద్‌ చౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ ఒక్కసారిగా కూలి వాహనాలపై పడింది. ఈ ఘటనలో మూడు వాహనాలు పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. హోర్డింగ్‌ కూలిన సమయంలో అక్కడ కొందరు వ్యక్తులు కూడా ఉన్నట్లు వీడియోలో కనిపించింది. 

Post a Comment

0 Comments

Close Menu