Ad Code

శనగపప్పు - ఆరోగ్య ప్రయోజనాలు !


నగపప్పులో శరీరానికి కావాల్సిన పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో హై ప్రోటీన్‌తో పాటు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. వారంలో రెండు సార్లైనా శనగపప్పు తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శనగపప్పులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా బరువు తగ్గే క్రమంలో తీసుకునే డైట్‌లో భాగంగా శనగపప్పును తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శనగపప్పులోని మోనోశాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీని కారణంగా గుండెపోటు ఇతర సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శనగపప్పులోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం కూడా సులభంగా తగ్గుతుంది. కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలపరచి, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను తగ్గించేందుకు ఎంతో ప్రభావంతంగా సహాయపడుతుంది. దీంతో పాటు ఎముకలు కూడా బలంగా మారుతాయి. శనగపప్పులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యలను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu