Ad Code

నేషనల్ కాన్ఫరెన్స్ కి అధికారంలోకి వస్తే ఎన్నికలు హలాల్ - లేకపోతే హరామ్!


మ్మూకాశ్మీర్ లో వచ్చే నెలలోఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాపై మండిపడ్డారు. ఆ పార్టీ తీసుకునే విధానాలపైన ఆమె తీవ్రంగా ఆరోపించారు. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ 'అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే నేషనల్ కాన్ఫరెన్స్ కి ఎన్నికలు హలాల్ అవుతాయి. అధికారం కోల్పోతే హరామ్ అవుతాయి. 1987లో జమాతే - ఇ - ఇస్లామీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్సిపి ఎలాంటి పోటీని ఎదుర్కోలేదు. నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్ని తన సామ్రాజ్యంగా పరిగణించడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. 1987లో నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడింది. ఒకవేళ జమాత్ -ఇ-ఇస్లామీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం మంచి విషయం. అయితే ప్రభుత్వం దానిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలి. వారు స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని తిరిగి ఇవ్వాలి. ఇది ప్రజాస్వామ్యం కోసం పోరాటం అని' ఆమె అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu