Ad Code

పురుషుల హాకీలో కాంస్యం !


పారిస్ ఒలింపిక్స్ లో భారత పురుషుల హకీ జట్టు అద్వితీయ విజయంతో కాంస్యం సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ డబుల్ గోల్‌తో స్పెయిన్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి నాలుగో మెడల్ అందించడంతో పాటు 52 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి కంచు మోత మోగించింది. ఒకానొక సమయంలో ప్రపంచ హాకీలో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత్ ఒలింపిక్స్‌లో అదరగొట్టింది. ధ్యాన్‌ చంద్ హయాంలో జైత్రయాత్ర కొనసాగిస్తూ పసిడి పతకాలను కొల్లగొట్టింది. 1968లో మెక్సికోలో జరిగిన ఒలింపిక్స్‌లో, ఆ తర్వాత 1972లో మ్యూనిచ్ (జర్మనీ) ఆతిథ్యమిచ్చిన విశ్వ క్రీడల్లో భారత్ కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇప్పుడు మళ్లీ 52 ఏండ్లకు వరుసగా రెండు కాంస్యాలతో భారత్ చరిత్ర సృష్టించింది. 

Post a Comment

0 Comments

Close Menu