Ad Code

X (ట్విట్టర్‌) సేవలకు మరోసారి అంతరాయం !


X (ట్విట్టర్‌) సేవల్లో అంతరాయం తలెత్తింది. బుధవారం ఉదయం ఫీడ్‌ ను పోస్ట్‌ చేయడం సహా రీప్రెష్‌ చేయడంలో అంతరాయం ఏర్పడినట్లు వినియోగదారులు ఎక్కువగా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కొంత మందికి పూర్తిసాయి సేవలు అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. మరికొంత మంది ఇప్పటికీ X ను వినియోగించలేకపోతున్నారని సమాచారం. పూర్తి వివరాలు. X లో తలెత్తిన సాంకేతిక సమస్య ను ప్రమఖ ట్రాకింగ్‌ వెబ్‌ సైట్‌ Downdetector.com గుర్తించింది. ఈ వెబ్‌ సైట్‌ ప్రకారం.. అమెరికాలో మంగళవారం రాత్రి వేళలో X లో అంతరాయం తలెత్తింది. X అంతరాయంపై సుమారు 35,000 రిపోర్టులు వచ్చినట్లు తెలుస్తోంది. భారత్‌ వినియోగదారులు కూడా ఈ సమస్య కారణంగా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. డౌన్‌డిటెక్టర్‌ నివేదిక ప్రకారం గరిష్ఠంగా 70 శాతం మంది X అంతరాయాన్ని ఎదుర్కొన్నారు. X యాప్‌ మరియు వైబ్‌ అప్లికేషన్‌ లోనూ అంతరాయం తలెత్తినట్లు తెలుస్తోంది. అయితే X లో అంతరాయానికి గల కారణాలను సంస్థ వెల్లడించలేదు. అయితే కొంత మంది యూజర్లు Try again, Something Went Wrong వంటి మెసెజ్‌ లు కనిపిస్తున్నాయి. డౌన్‌డిటెక్టర్‌ ప్రకారం అమెరికాలో 30,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. అదే కెనడా లో 3,300, UK లో 1600 మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే Xలో తలెత్తిన అంతరాయంపై అనేక మంది యూజర్లు ట్రోల్స్‌ చేస్తున్నారు. ఎలాన్‌ మస్క్‌ సహా X ప్లాట్‌ఫాం పై మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు. ట్విట్టర్‌ ను ఎలాన్‌ మస్క్ కొనుగోలు చేసినప్పుటి నుంచి అనేక సార్లు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కొనుగోలు సమయంలోనూ X లోని సాంకేతిక సమస్యల పట్ల మస్క్‌.. అప్పటి యాజమాన్యంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే తరచూ అంతరాయాలు సహా ఇతర సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో భవిష్యత్‌ లో X పరిస్థితిపై అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎలాన్‌ మస్క్‌ మరియు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య ఇటీవల సంభాషణ జరిగింది. అనంతరం ఈ తరహా అంతరాయం ఏర్పడింది. అయితే తాజాగా ఏర్పడిన అంతరాయం నుంచి తక్కువ సమయంలోనే బయటపడగలిగారు. అయితే X ప్లాట్‌ఫాం.. మస్క్‌ చేతిలోకి వచ్చిన నుంచి ఎదురవుతున్న సమస్యల పట్ల సోషల్‌ మీడియా లో మీమ్స్‌ ఎక్కువగా వస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu