Ad Code

హానర్ 200 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల !


దేశీయ మార్కెట్లో హానర్ 200 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు విడుదల  విడుదల చేసింది. హానర్ 200 సిరీస్ నుంచి ముందుగా ప్రీమియం మరియు మిడ్ రేంజ్ ఫోన్ లను విడుదల చేసిన హానర్, ఇప్పుడు బడ్జెట్ కేటగిరిలో ఈ కొత్త హానర్ 200 లైట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ను లాంచ్ ఆఫర్లతో బడ్జెట్ ధరలో అందించినా, ఈ ఫోన్ లో మాత్రం ఆకట్టుకునే ఫీచర్స్ అందించింది. ఈ కొత్త ఫోన్ ను రూ. 17,999 రూపాయల ఆఫర్ ధరకు అందించింది. అయితే, ఈ ఫోన్ ను SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 15,999 ధరకే అందుకోవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ పార్రంభ తేదీ అయిన సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ను అమెజాన్ ఇండియా మరియు explorehonor.com నుంచి సేల్ అవుతుంది. 6.78mm మందంతో చాలా స్లీక్ డిజైన్ తో అందించింది మరియు ఈ ఫోన్ కేవలం 166 గ్రాముల బరువుతో చాలా లైట్ గా ఉంటుంది. ఈ ఫోన్ 200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 6.7 ఇంచ్ AMOLED స్క్రీన్ ను FHD+ రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ హానర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ SGS 5-star Drop రెసిస్టెంట్ సర్టిఫికేషన్ తో వస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu