Ad Code

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై లోకాయుక్త కేసు నమోదు !


ర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై లోకాయుక్త కేసు నమోదు చేసింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయింపుల కుంభకోణంలో సిద్ధరామయ్యను ఏ1 నిందితుడిగా, ఆయన భార్య పార్వతిని ఏ2గా, బావమరిది మల్లికార్జున్ స్వామిని ఏ3గా, భూమి అమ్మిన దేవరాజ్‌ను ఏ4గా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. కోట్ల విలువైన భూమిని దేవరాజ్‌ నుంచి మల్లికార్జున్ స్వామి కొనుగోలు చేశాడు. ఆ భూమిని అక్క పార్వతికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. కాగా, మైసూరు అభివృద్ధి సంస్థ పార్వతి నుంచి 3.16 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నది. ఎక్కువ విలువైన ప్లాట్లను పరిహారంగా ఆమెకు ఇచ్చింది. అయితే చట్టవిరుద్ధమైన భూ పరిహార ఒప్పందం వల్ల సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య సుమారు రూ.4,000 కోట్ల మేర లబ్ది పొందినట్లు ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేసేందుకు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆగస్టులో అనుమతి ఇచ్చారు. గవర్నర్‌ అనుమతిని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. మరోవైపు ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన ఫిర్యాదుపై మైసూరులోని లోకాయుక్త స్పందించింది. ఈ భూ స్కామ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య, బావమరిదితో పాటు మరో వ్యక్తిపై లోకాయుక్త పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.

Post a Comment

0 Comments

Close Menu