Ad Code

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో అనుమానస్పద స్థితిలో బ్యాగ్ !


హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో అనుమానస్పద స్థితిలో ఓ బ్యాగ్ కనిపించడం కలకలం రేపింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు అనుమానాస్పద బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద బ్యాగ్‌ను అక్కడి నుంచి అధికారులు తరలించి తనిఖీ చేస్తున్నారు. బాంబు స్క్వాడ్ ఆ బ్యాగ్‌ను తనిఖీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ బ్యాగ్‌లో ఏముందనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Post a Comment

0 Comments

Close Menu