Ad Code

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం


హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం మళ్లీ మొదలైంది. సాయంత్రం ఆకాశం మేఘావృతం కాగా.. ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, మెహిదీపట్నం ఎస్‌ఆర్‌ నగర్‌, కూకట్‌పల్లి, బాచుపల్లి, ప్రగతినగర్‌, నిజాంపేట్‌, మియాపూర్‌, బేగంపేట్ ప్రాంతాలతో సహా తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో భారీగా కురుస్తున్న వర్షం కురుస్తోంది. గండిపేట్ రాజేంద్ర నగర్, ఉప్పర పల్లి మణికొండ, నార్సింగి, మైలార్‌దేవ్‌పల్లి భారీగా వర్షం నీరు ప్రవహిస్తుంది. ఉప్పరపల్లి, ఆరంగర్ చౌరస్తా బ్రిడ్జి, నేషనల్ పోలీస్ అకాడమీ రోడ్డుపై వరద నీరు నిలిచిపోయింది.. జోరుగా కురుస్తున్న వర్షం వల్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కాలనీల్లో వరద ఇబ్బందులు లేదా విపత్కర పరిస్థితులు ఉంటే 040-21111111 లేదా 9000113667 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

Post a Comment

0 Comments

Close Menu