Ad Code

ఆంధ్రప్రదేశ్ లో దీపావళీ నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ !


దీపావళీ నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ స్కీం ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అలాగే సంక్షేమ పథకాలు అమలు చేస్తాం.. అభివృద్ధి పనులను స్ట్రీమ్ లైన్ చేస్తాం. వరద సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 350 కోట్లు వచ్చాయి. వరద సాయం కోసం ఎమ్మెల్యేలంతా ఒక నెల జీతాన్ని విరాళంగా ఇద్దాం. బుడమేరు కబ్జాలకు గురైంది. కనివినీ ఎరుగని రీతిలో వరద వచ్చింది. వరదలో బాధితుల కష్టాలు వర్ణనాతీతం. వరద బాధితులకు బెస్ట్ ప్యాకేజీ ఇవ్వాలనుకున్నాం. రికార్డు స్థాయిలో వరద బాధితులకు బెస్ట్ ప్యాకేజీ ఇచ్చాం. కౌలు రైతులకు న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకున్నాం. కోట్లాది మంది కూటమిపై ఆశలు పెట్టుకున్నారు. ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. ప్రజలు ఇంతటి నమ్మకం పెట్టుకున్న తర్వాత తప్పులు చేయొద్దు, కక్ష సాధింపులకు దిగొద్దు. కక్ష సాధింపు చేయాలంటే ముందుగా నేనే చేయాలి. కానీ అది మన విధానం కాదు. ఎన్నికల ముందు మూడు పార్టీల మధ్య ఉన్న సమన్వయం అద్భుతం. ఈ వంద రోజుల్లో కూడా అదే సమన్వయంతో పని చేశారు అని చంద్రబాబు అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu