Ad Code

కోల్‌కతా హత్యాచార ఘటనపై మోక్షా సేన్‌ గుప్తా అద్భుత నృత్యం - వీడియో వైరల్


శ్చిమ బెంగాల్ హత్యాచార ఘటనను నిరసిస్తూ నటి, డ్యాన్సర్ మోక్షా సేన్‌గుప్తా ఆవేశంగా చేసిన డ్యాన్స్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఎన్‌జీఓ సంస్థ దక్షిణ కోల్‌కతాలో వీధిలో ప్రదర్శనలు నిర్వహిస్తుండగా ఈ నటి డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఆమె అందరి ముందే మాస్ స్టెప్పులతో, రౌద్రంగా భద్రకాళిలా పవర్ ఫుల్ స్టెప్పులు వేసింది. ఆమె ముఖంపై ఉన్న ఫెస్ ఎక్స్ ప్రెషన్స్ సైతం చాలా రౌద్రంగా ఉన్నాయి. ఆమె చేసిన పవర్‌ఫుల్ డ్యాన్స్ అందరినీ షాకింగ్ కు గురిచేసిందని చెప్పుకొవచ్చు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్ లు భద్రకాళీ వచ్చి డ్యాన్స్ చేస్తుందా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈఘటనపై మోక్ష స్పందించారు. ఈ దారుణం జరిగినప్పుడు హైదరబాద్ లో ఉన్నట్లు తెలిపారు. ఆ తర్వాత సొంత ప్రదేశానికి వచ్చి నిరసనల్లో పాల్గొన్నట్లు తెలిపారు. మోక్ష తెలుగు మూవీస్ లలో నటించారు. అలనాటి రామచంద్రుడు', 'నీతోనే నేను', ' 'ఐ హేట్‌ యూ' వంటి చిత్రాలలో నటించి అందరిని ఫిదా చేశారు. అదే విధంగా తాజాగా ధన్‌రాజ్‌, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'రామం రాఘవం' చిత్రంలో కూడా నటిస్తున్నారు. 


Post a Comment

0 Comments

Close Menu