Ad Code

వెస్టిండీస్ వెటరన్ క్రికెటర్ డ్వేన్ బ్రావో రిటైర్మెంట్ !


వెస్టిండీస్ వెటరన్ క్రికెటర్ డ్వేన్ బ్రావో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్‌లో సెయింట్ లూసియా కింగ్స్‌తో ఆడుతున్నప్పుడు బ్రావో వెన్ను గాయంతో బాధపడ్డాడు. ఆ గాయం కారణంగానే బ్రేవో ఈ నిర్ణయం తీసుకున్నాడు. బ్రావో 2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు మరియు 2022లో ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు తన ఫిట్‌నెస్ సంబంధిత సమస్యల కారణంగా ఫ్రాంచైజీ క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పాడు.ఈ సందర్భంగా బ్రేవో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. “క్రికెట్‌ నాకు జీవితం ఇచ్చింది. ఐదేళ్ల వయసు నుంచి క్రికెట్ నా శ్వాసగా మారింది. వెస్టిండీస్కు ప్రాతినిధ్యం వహించడం అదృష్టంగా భావిస్తున్నాను. వివిధ దేశాలలో ఎన్నో లీగ్స్ ఆడాను. ఇవన్నీ నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు. నేను అత్యుత్తమ క్రికెటర్‌గా మారడానికి ఎంతోమంది హెల్ప్ చేశారు. వారందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ తాను సాధించిన విజయాలను వాళ్లందరికీ అంకితం చేశాడు ఈ వెటరన్ క్రికెటర్. బ్రావో 582 మ్యాచ్ లలో 631 వికెట్లతో టీ20 చరిత్రలో అత్యధిక వికెట్లు తీసి బెంచ్‌మార్క్‌ని నెలకొల్పాడు. ఐపీఎల్, పాకిస్థాన్ సూపర్ లీగ్, బిగ్ బాష్ లీగ్ లాంటి విదేశీ లీగ్ లలో తన దమ్ము చూపించాడు. విండీస్ తరుపున రెండు టీ20 ప్రపంచ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. సీపీఎల్‌లో బ్రావో మొత్తం 107 మ్యాచ్‌లు ఆడాడు. 20.62 సగటు, 129.33 స్ట్రైక్ రేట్‌తో 1,155 పరుగులు చేశాడు. అలాగే 23.02 ఎకనామీతో 129 వికెట్లు తీశాడు. ఇకపోతే బ్రేవో క్రికెట్ ప్రపంచంలో ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చాడు. వికెట్ పడితే బ్రావో డ్యాన్స్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అతని డ్యాన్స్ కి అవుట్ అయిన బ్యాటర్ సైతం నవ్వుకుంటూ పెవిలియన్ వైపు వెళ్తాడు. ఎప్పుడూ సరదాగా ఉండే బ్రేవో క్రికెట్ ప్రపంచానికి పూర్తిగా దూరమవ్వడం క్రికెట్ అభిమానుల్ని బాధకు గురి చేస్తుంది

Post a Comment

0 Comments

Close Menu