Ad Code

రేవ్ పార్టీలో సినీ నటి హేమ డ్రగ్స్ తీసుకొన్నారు !


బెంగళూరు పోలీసులు సినీ నటి హేమ గురించి కొన్ని విషయాలు  బయటపెట్టారు. హేమ ఆ పార్టీలో ఉన్నది నిజమే. అలాగే ఆ పార్టీలో డ్రగ్స్ కూడా తీసుకుంది. హేమ తన ఫ్రెండు పిలవగా ఆ పార్టీకి వెళ్ళింది. ఆ పార్టీలో డ్రగ్స్ కూడా తీసుకుంది అని పోలీసులు తెల్చేశారు. దీంతో ఒక్కసారిగా హేమ డ్రగ్స్ వ్యవహారం మరొకసారి మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు బెంగళూరు రేవ్ పార్టీలో దాదాపు 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. సినీ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు మెడికల్ రిపోర్టు కూడా జత చేశారు. అలాగే హేమపై చార్జిషీట్ దాఖలు చేశారు. దీంతో హేమ వ్యవహారం మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ హేమకు పోలీసుల నుండే కాదు మా అసోసియేషన్ నుండి కూడా షాక్ తగలబోతోంది. ఎందుకంటే ఆమెకు డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ వస్తే కచ్చితంగా మా అసోసియేషన్ నుండి తొలగిస్తామని మంచు విష్ణు చెప్పారు. 

Post a Comment

0 Comments

Close Menu