Ad Code

టెస్టుల్లో టీమ్ ఇండియా అరుదైన ఘనత !


కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఈ ఘనత సాధించింది. 10.1 ఓవర్లలోనే (61 బంతుల్లోనే) జట్టు స్కోరు 100 పరుగులు దాటి టెస్టు క్రికెట్‌లో అత్యధిక వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. కాగా గతంలో ఈ రికార్డు టీమ్ ఇండియా పేరిటే ఉండడం విశేషం. 2023లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచులో భారత్ 12.2 ఓవర్లలో 100 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం మూడు ఓవర్లు (18) బంతుల్లోనే 50 పరుగులు చేసింది. దీంతో 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన జట్టుగా రికార్డులకు ఎక్కింది. గతంలో ఈ రికార్డు ఇంగ్లాండ్ పేరిట ఉండగా భారత్ బద్దలు కొట్టింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు కుప్పకూలింది. బంగ్లా బ్యాటర్లలో మోమినుల్ హక్ (107 నాటౌట్ ) శకతంతో చెలరేగాడు. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీశాడు. సిరాజ్‌, అశ్విన్‌, ఆకాశ్ దీప్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా ఓ వికెట్ సాధించాడు.

Post a Comment

0 Comments

Close Menu