Ad Code

ఎర్ర తోటకూర - ఆరోగ్య ప్రయోజనాలు !


ఎర్ర తోటకూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి,కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం, జింక్, రాగి, మాంగనీస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ మరియు ప్రోటీన్ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి శరీరాన్ని పోషించి మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎర్ర తోటకూరలో ఆంథోసైనిన్ అనే సమ్మేళం శరీరాన్ని ఆక్సీకరణ నుంచి రక్షిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని దాదాపుగా తగ్గిస్తుంది. ఎర్ర తోటకూరలో అధిక పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. నైట్రేట్ కంటెంట్ ఆరోగ్యకరమైన రక్త ప్రవాహాన్ని కాపాడుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. షుగర్ పేషంట్లు తమ రోజువారి ఆహారంలో ఎర్ర తోటకూరను చేర్చుకుంటే ఎంతో మేలు చేస్తుంది. ఒక కప్పు ఎర్ర తోటకూరలో 250ఎంజీ కాల్షియం ఉంటుంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీన్ని తింటే ఎముకలు, దంతాలు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ తోటకూరలోని పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాలను తగ్గిస్తుంది. అధిక రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది. హైబీపీ పేషంట్లు ఈ ఆకుకూరను డైట్లో చేర్చుకుంటే బీపీ నార్మల్ గా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఎర్ర తోటకూరను వారానికి ఒకటి రెండు సార్లైనా తినాలని నిపుణులు చెబుతున్నారు.


Post a Comment

0 Comments

Close Menu