Ad Code

పరమ్‌ రుద్ర సూపర్‌ కంప్యూటర్లను వర్చువల్‌గా ఆవిష్కరించిన ప్రధాని మోడీ !


ఢిల్లీ, పూణే, కోల్‌కతాలో ఏర్పాటు చేసిన పరమ్‌ రుద్ర సూపర్‌ కంప్యూటర్లను  ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందుకోసం రూ.130 కోట్ల వ్యయమైనట్లు తెలుస్తోంది. దీంతోపాటు వాతావరణ పరిశోధనల కోసం రూ.850 కోట్లతో రూపొందించిన హై పెర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌ సిస్టమ్‌ను కూడా మోడీ ఆవిష్కరించారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పరిశోధనల ప్రాధాన్యతతో భారత్‌ ముందుకెళ్తోందని, సాంకేతిక విప్లవంలో భారత్ వాటా బిట్లు, బైట్స్‌లో కాకుండా టెరా బెట్లు, పెటా బైట్లో ఉండాలని మోడీ ఆకాక్షించారు. సాంకేతికత మరియు కంప్యూటింగ్‌ సామర్థ్యాలపై ఆధారపడని రంగం ఏదీ లేదని ప్రధాని అన్నారు. ఈ విజయం మనం సరైన వేగంతో సరైన దిశలో పయనిస్తున్నట్లు రుజువు చేస్తోందన్నారు. సొంతంగా సెమీకండక్టర్‌ ఎకోసిస్టమ్ నిర్మాణంతోపాటు ప్రపంచ సరఫరా గొలుసులో కీలకంగా మారినట్లు ప్రధాని తెలిపారు. సాంకేతిక విప్లవంలో కంప్యూటింగ్ సామర్థ్యం దేశం శక్తికి ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. ఈ సూపర్‌ కంప్యూటర్లు సాధారణ కంప్యూటర్ల కంటే ఎంతో భిన్నంగా ఉంటాయి. వేల రెట్లు వేగంతో పనిచేస్తాయి. పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లు భారీ మొత్తంలో డేటాను ప్రాసెస్‌ చేయగలవు. వీటిని శాస్త్రీయ పరిశోధనల్లో ఉపయోగించనున్నారు. పూణేలోని జెయింట్‌ మీటర్ రేడియో టెలిస్కోప్‌, ఫాస్ట్‌ రేడియో బర్స్ట్స్ కోసం పరమ రుద్ర కంప్యూటర్‌ను వినియోగిస్తారు. ఖగోళ ఆవిష్కరణలపై అధ్యయనం చేయనుందని తెలుస్తోంది. ఢిల్లీని ఇంటర్‌ యూనివర్సిటీ యాక్సిలరేటర్‌ సెంటర్‌లో రెండో సూపర్‌ కంప్యూటర్‌ను ఉపయోగించనున్నారు. న్యూక్లియర్‌ ఫిజిక్స్‌, మెటీరియల్‌ సైన్స్‌ రంగాల్లో కీలక సమాచారాన్ని పొందేందుకు వీటిని ఉపయోగించనున్నారని తెలుస్తోంది. కోల్‌కతాలోని ఎస్ఎన్ బోస్‌ సెంటర్ ఫిజిక్స్‌, కాస్మోలజీ మరియు ఎర్త్‌ సైన్సెస్‌ మరో సూపర్ కంప్యూటర్‌ను వినియోగించనున్నారు. ఈ మూడు సూపర్‌ కంప్యూటర్లను వైజ్ఞానిక పరిశోధనలను సులభతరం చేసేందుకు వినియోగించనున్నారు. వాతావరణ సూచనలు, మెటీరియల్‌ సైన్స్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, క్లైమేట్‌ మోడలింగ్‌ వంటి రంగాల్లో పరిశోధనల కోసం వీటిని ఉపయోగిస్తారు. శాస్త్రవేత్తలకు సంక్లిష్టంగా తోచిన సమస్యల పరిష్కారానికి, ముఖ్యమైన పరిశోధనలు, ఆవిష్కరణల్లో ఈ సూపర్‌ కంప్యూటర్లను ఉపయోగిస్తారు. పరమ్‌ రుద్ర సూపర్‌ కంప్యూటర్‌ల ఆవిష్కరణతో శాస్త్రీయ విజ్ఞానం, ఆవిష్కరణల కోసం ఆధునిక సాంకేతికను స్వీకరించడంతో భారత్‌ కీలక మైలురాయిని చేరుకుంది. 

Post a Comment

0 Comments

Close Menu