Ad Code

ఎంత గగ్గోలు పెట్టినా రేవంత్ రెడ్డి నా అంత ఎత్తుకు ఎదగలేరు : హరీశ్ రావు


'నా ఎత్తు గురించి మాట్లాడటం పక్కనబెట్టి, ప్రజల సమస్యలు పరిష్కరించడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలి. ఎంత గగ్గోలు పెట్టినా రేవంత్ రెడ్డి నా అంత ఎత్తుకు ఎదగలేరు. అసలు నా ఎత్తు గురించి రేవంత్‌కు ఎందుకు అంత బాధ' హరీశ్ రావు ప్రశ్నించారు. రుణమాఫీపై సీఎం చెబుతున్నవన్ని అబద్ధాలే అని ఆరోపించారు. సీఎం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో ముందు రుణమాఫీ పూర్తిగా అయ్యిందో లేదో కనుక్కోవాలన్నారు. దీనిపై చర్చించేందుకు తాను సిద్ధమని రేవంత్ రెడ్డి కూడా సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. తనను ఇష్టానుసారం తిడుతున్నారని, రేవంత్‌ను సన్నాసి అని తాను అనలేనా ? అని ఫైర్ అయ్యారు. చెప్పినవే చెప్పి ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. సీఎం స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని అన్నారు. మాట తప్పిన సన్నాసులు ఈ ప్రభుత్వ పెద్దలు కాదా? అని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏం చేసినా, ఏం మాట్లాడినా తాము ఇంతకాలం ఓపిక పట్టామని, కానీ ఓపికకు కూడా ఓ హద్దు ఉంటుందని అన్నారు. వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టారని మండిపడ్డారు. రుణమాఫీపై సీఎం ఒక మాట మాట్లాడితే మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తనను ఎక్కడ దాక్కున్నావ్ అని అడుగుతున్నారు. నేను సీఎం గుండెళ్లోనే ఉన్నానని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ ఫార్మాసిటీ పేరుతో భూములు సేకరించారు. ఆ భూముల్లో ఫోర్త్ సిటీ అంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రెండోసారి గెలిచే సీన్ కాంగ్రెస్‌కు లేదన్నారు.

Post a Comment

0 Comments

Close Menu