Ad Code

తెలంగాణలో హైడ్రా కోసం ప్రత్యేకంగా ఆర్దినెన్స్!


తెలంగాణలో హైడ్రా కోసం ప్రత్యేకంగా ఆర్దినెన్స్ పై కసరత్తు జరుగుతోంది. హైడ్రాకు మరింతగా అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ చట్టాన్ని రూపొందించనుంది. తెలంగాణ భూ ఆక్రమణ చట్టం -1905క సవరణకు నిర్ణయించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ తెచ్చేలా కసరత్తు జరుగుతోంది. రెవిన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, బీపాస్, వాల్టా, ఫైర్ సర్వీసెస్ శాఖలకు చట్టం ద్వారా ఉన్న కొన్ని అధికారాలను..కొన్ని ప్రత్యేక జీవోల ద్వారా వచ్చిన అధికారాలను తాజాగా తీసుకొస్తున్న ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు అప్పగించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. హైడ్రా ఏర్పాటు సమయంలోనే ప్రభుత్వం విధులు, బాధ్యతలు ఖరారు చేసింది. అయితే, హైడ్రా పరిధిలోని ఆస్తుల సంరక్షణ, విపత్తుల నిర్వహణ విభాగాలు ఇతర శాఖలకు సంబంధించిన అధికార పరిధిలో ఉన్నాయి. ఈ అధికారాలు చట్టం ద్వారా హైడ్రాకు ఇవ్వకపోతే లక్ష్యం దెబ్బ తింటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో, వివిధ శాఖలకు చట్టపరంగా దక్కిన కొన్ని అధికారాలను తొలిగించి వాటిని హైడ్రాకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ తీసుకురానుంది. హైడ్రాకు ప్రత్యేక అధికారాలు అప్పగించటం పైన న్యాయవిభాగం పలు సూచనలు చేసింది. రెవిన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, బీపాస్, వాల్టా, ఫైర్ సర్వీసెస్ శాఖల కొన్ని అధికారాలు బదలాయించటం తో పాటుగా హైడ్రా గవర్నింగ్ బాడీలో సీసీఎల్ఏ ఉండాలని..మిగిలిన చట్టాల్లో కొన్ని నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రభుత్వానికి నివేదించింది. వీటి పైన ప్రభుత్వం సంబంధిత శాఖలతో చర్చలు చేసింది. తరువాత తెలంగాణ భూ ఆక్రమణ చట్టం-1905కు సవరణ చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం మంత్రివర్గం ఆమోదంతో ఆర్దినెన్స్ కు సిద్దమైంది.

Post a Comment

0 Comments

Close Menu