Ad Code

హైదరాబాద్ లో షాకింగ్ యాక్సిడెంట్ : సోషల్ మీడియాలో వీడియో వైరల్ !


హైదరాబాద్ లోని వనస్థలిపురం ఎన్జీవో కాలనీలో జరిగిన ప్రమాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక యువతి తన మార్గంలో తాను వెళ్తుంది. ఇంతలో ఒక కారు వెనక నుంచి వేగంగా వచ్చి, ఆమెను బలంగా ఢీకొట్టింది. కారు స్పీడ్ కు ఆమె గాల్లో బంతిలాగా ఎగిరి దూరంగా పడిపోయింది. ఆమె దాదాపు10 మీటర్ల దూరంలో ఎగిరి పడినట్లు తెలుస్తోంది. వెంటనే స్థానికలు యువతిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. యువతికి బలమైన గాయాలు అయినట్లు కూడా తెలుస్తోంది. కారు ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. కారు ప్రమాదానికి చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ కు గురౌతున్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలు, స్కూళ్ల వద్ద జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు. కారు నడపడం రాకుండా బైటకు తీసి ఇతరుల ప్రాణాలు పోయేలా డ్రైవ్ చేయడం ఏంటని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu