Ad Code

వణికిస్తున్న ఎక్స్ఈసీ కరోనా వేరియంట్ ?


త్యంత ప్రమాదకరమైన ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్ పట్ల అలర్టుగా ఉండాలని ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు. తొలుత జర్మనీలో కనుగొన్న ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్ బ్రిటన్‌, అమెరికా, డెన్మార్క్‌తో పాటు ఇతర యూరోప్‌ దేశాల్లో వేగంగా విస్తరిస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే 27 దేశాలకు వ్యాప్తి చెందిన ఎక్స్ఈసీ కరోనా వేరియంట్ కేసుల నుంచి 500 శ్యాంపిళ్ళను సేకరించి పరీక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఓమిక్రాన్ వేరియంట్‌కు సబ్‌లీనియేజ్‌గా ఉన్న ఈ కొత్త వేరియంట్‌లో కొత్త తరహా మ్యుటేషన్లు ఉన్నట్లు గుర్తించారు. గతంలో ప్రబలిన ఓమిక్రాన్ సబ్‌వేరియంట్లు కేఎస్.1.1, కేపీ.3.3 తరహాలో ఎక్స్ఈసీ వైరల్ వ్యాపిస్తుందని సైంటిస్టులు తెలిపారు.  పోలాండ్‌, నార్వే, లగ్జంబర్గ్‌, ఉక్రెయిన్, పోర్చుగల్‌, చైనా దేశాల్లో ఎక్స్ఈసీ కరోనా వేరియంట్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల వచ్చిన కోవిడ్ వేరియంట్ల కంటే ఎక్స్ఈసీ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లుగా లండన్ జెనటిక్స్ కాలేజీ ప్రొఫెసర్ ఫ్రాంకోసిస్ బల్లాక్స్ వెల్లడించారు. ఎక్స్ఈసీ కరోనా వేరియంట్ సోకిన వారిలో జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, వాసన కోల్పోవడం, బరువు తగ్గిపోవడం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఓమిక్రాన్ వేరియంట్‌కు చెందినది కావడంతో వ్యాక్సిన్లు, బూస్టర్లతో రక్షణ కల్పించవచ్చని, స్వచ్చమైన గాలిని పీల్చాలని అమెరికా సీడీసీ వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu