Ad Code

రూ.కోటి దాటిన ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం !


హైదరాబాద్ అంటే ఖైరతాబాద్ బడా గణేష్, బాలాపూర్ గణేషుడు గుర్తుకు వస్తాయి. బాలాపూర్ గణేషుడి లడ్డూ చాలా ఫేమస్. ఇక్కడ లడ్డు లక్షల్లో పలుకుతుంది. ఇక ఖైరతాబాద్ గణనాథుడు తెలంగాణకే ఫేమస్. ఈసారి ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు 70 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనం ఇచ్చాడు. ఖైరతాబాద్ సప్తముఖ మహా గణపతిని చూసేందుకు భారీ ఎత్తున భక్తులు వచ్చారు. 11 రోజులు భక్తులకు తన విశ్వరూపంతో దర్శనమిచ్చిన గణపయ్య మంగళవారం గంగమ్మ ఒడికి చేరనున్నాడు. అయితే ఈసారి ఖైరతాబాద్ గణేషుడి హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. హుండీ ఆదాయమే 70 లక్షల రూపాయలు వచ్చిన ఉత్సవ కమిటీ తెలిపింది. విఘ్నేశ్వరుడి చుట్టూ, పరిసరాల్లో ఏర్పాటు చేసిన వివిధ కంపెనీల ప్రకటనల ద్వారా మరో 40 లక్షల రూపాయల వరకు ఆదాయం సమకురినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.కోటికి పైగా ఆదాయం వచ్చినట్లు సమాచారం. అలాగే గణపయ్యకు స్కానర్ల ద్వారా కూడా పే చేశారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేశారు. ఇప్పుడు వాటిని కూడా లెక్కించాలి. ఏది ఏకమైనప్పటికీ ఈసారి ఖైరతాబాద్ గణనాథుడిని 30 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తోంది. గణపయ్య దర్శనాన్ని ఆదివారం అర్ధరాత్రి నిలిపివేశారు. ప్రస్తుతం వెల్డింగ్ పనులు చేస్తున్నారు. తెల్లవారుజాము వరకు వెల్డింగ్ పనులు పూర్తి కానున్నాయి. ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల లోపు క్రేన్ నెం.4 వద్ద ఖైరతాబాద్ సప్తముఖ మహా గణపతి నిమజ్జనం చేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గణేషుడి నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అటు బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర సీసీ కెమెరా నిఘాలో నిర్వహించనున్నారు.

Post a Comment

0 Comments

Close Menu