Ad Code

గుంటూరులో నవంబర్ 10 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ


ఆంధ్రప్రదేశ్ లో అగ్నివీర్ రిక్రూట్ మెంట్ గుంటూరులోని డీఎస్ఏ స్టేడియంలో నిర్వహించబోతున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. నవంబర్ 10 నుంచి 15 వరకు ఐదు రోజుల పాటు ర్యాలీ ఉంటుంది పేర్కొన్నారు. ఈ ర్యాలీలో 13 జిల్లాల అభ్యర్థులకు మాత్రమే పాల్గొనే ఛాన్స్ ఉంటుంది. కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు బాపట్ల, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్ మెంట్ లో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్10TH ట్రేడ్స్‌మన్, అగ్నివీర్ 8TH ట్రేడ్స్‌మన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అగ్నివీర్ ట్రేడ్స్‌మన్ కు 8వ తరగతిని ఉత్తీర్ణతగా పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డులను తీసుకురావాల్సి ఉంటుంది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్ మరియు పారదర్శకంగా ఉంటుందని అధికారులు తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. రిక్రూట్ మెంట్ ప్రమాణాలకు తగ్గట్టుగా ప్రదర్శన ఉన్నవారినే ఎంపిక చేస్తారని స్పష్టం చేశారు. ఫిజికల్ టెస్ట్‌లో భాగంగా 1,600 మీటర్ల రన్నింగ్ నిర్వహిస్తారు. రన్నింగ్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇతర ఈవెంట్లు, పరీక్షలు ఉంటాయి. ఈ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి అభ్యర్థులు భారీగా హాజరవుతారని అంచనా. రోజుకూ వెయ్యి మంది చొప్పున అభ్యర్థులకు ఎంపిక చేస్తారు. ఈ ర్యాలీలో ఎంపికైన అభ్యర్థులకు ఆర్మీ శిక్షణ నిర్వహించనున్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్‌, ఆఫీస్ అసిస్టెంట్‌, స్టోర్ కీపర్ టెక్నికల్ విభాగాల్లో ఎంపికైన అభ్యర్థులు పని చేయాల్సి ఉంటుంది. 

Post a Comment

0 Comments

Close Menu