Ad Code

ప్రపంచవ్యాప్తంగా కడు పేదరికంలో 110 మిలియన్ల మంది జనాభా !


ప్రపంచవ్యాప్తంగా వందకోట్లకు పైగా ప్రజలు కడు పేదరికంలో జీవిస్తున్నారు. వీరిలో సగానికి పైగా ప్రజలు నివసిస్తున్న దేశాల్లో యుద్ధ పరిస్థితులు ఉన్నాయని యుఎన్‌ నివేదిక తెలిపింది. యుద్ధాలతో ఆయా దేశాల్లో మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, దీంతో ఆ దేశాలు 'మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ'లోని అన్ని సూచీల్లోనూ అధిక స్థాయిలో ఉన్నట్లు యుఎన్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. పౌష్టికాహారం, విద్యుత్తు, మంచినీరు, మురుగు కాల్వలు వంటి మౌలిక సదుపాయాల్లో గరిష్టంగా, తీవ్ర అసమానతలు ఉన్నట్లు తెలిపింది. 112 దేశాల్లో 630 కోట్లకు పైగా చేపట్టిన ఈ అధ్యయనంలో 110 కోట్ల మంది తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటుండగా, వీరిలో 45 కోట్ల 50 లక్షల మంది యుద్ధం నీడలో జీవిస్తున్నారని పేర్కొంది. ఇటీవల కాలంలో యుద్ధాలు తీవ్రం కావడంతో పాటు పలు ప్రాంతాలకు వ్యాపించాయని యుఎన్‌డిపి అకీమ్‌ స్టైనర్‌ పేర్కొన్నారు. క్షతగాత్రులు, నిరాశ్రయులైన తీవ్రంగా పెరగడంతో వారి జీవనోపాధితో పాటు జీవనంపై తీవ్ర ప్రభావం పడిందని అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu