Ad Code

గుహలో 188 ఏళ్ల వృద్ధుడు - సోషల్ మీడియాలో వైరల్


బెంగళూరుకు సమీపంలోని ఓ గుహలో ఉన్న వృద్ధుడిని స్థానికులు బయటికి తీసుకువచ్చారు. అతడి వయసు 188 ఏళ్లు ఉంటాయని చెబుతున్నారు. ఆ వృద్ధుడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మధ్య ప్రదేశ్ కు చెందిన సియారామ్ బాబా అని తెలిసింది. ఆయన వయసు 110 ఏళ్లు ఉంటాయని అంచనా. ఆయన రామ భక్తుడు అని, 10 ఏళ్ల పాటు ఒంటి కాలు మీద కఠినమైన తపస్సు చేశారని చెబుతుంటారు. సియారామ్ బాబా తన జీవితాన్ని రాముడు, రామాయణానికి అంకితం చేశారు. వందేళు దాటిన తరువాత కూడా అతను ఎలాంటి కళ్లజోడు లేకుండా పుస్తకం చదువుతాడు. అతని 21 గంటల పఠన సామర్థ్యం, నడక వల్లే అతను ఇంతకాలం ఆరోగ్యం ఉండగలిగాడని అంటున్నారు.

Post a Comment

0 Comments

Close Menu