Ad Code

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 20 వేల కోట్లను విడుదల చేసిన నరేంద్ర మోడీ !


హారాష్ట్ర లోని వాషిమ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతుల ఖాతాలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 20 వేల కోట్లను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా 20,000 కోట్లను జమ చేశారు. వెబ్‌కాస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన కేంద్రాలు, 1 లక్షకు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల కామన్ సర్వీస్ సెంటర్‌లతో సహా దాదాపు 2.5 కోట్ల మంది రైతులు ఈ కార్యక్రమంలో చేరారు.  ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 24 ఫిబ్రవరి 2019న ప్రారంభించారు. భూమిని కలిగి ఉన్న రైతులకు మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 6,000 అందిస్తుంది. అందులో భాగంగానే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడతను ఈరోజు ప్రధాన మంత్రి విడుదల చేశారు. 18వ విడత విడుదలతో ఈ పథకం కింద మొత్తం పంపిణీ రూ. 3.45 లక్షల కోట్లు దాటుతుంది. దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికి పైగా రైతులకు చేయూతనిస్తుంది. 


Post a Comment

0 Comments

Close Menu