Ad Code

టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్‌ పై భారత్ విజయం !


దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న ఐసీసీ ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా పాకిస్తాన్‌ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించింది. తొలి మ్యాచ్ లో ఓడిన టీమిండియా రెండో మ్యాచ్ లో పాకిస్థాన్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ తొలి 105 పరుగులకే పాక్ ను నిలువరించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్‌ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు స్కోర్ చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నిదా దర్‌ 28 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. ఓపెనర్ మునీబా అలీ 17 పరుగులు చేయగా, ఫాతిమా సనా 13 పరుగులు చేసింది, ఇక మరో ప్లేయర్ అరూబ్ షా 14 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. ఇక భారత బౌలర్ల ధాటికి గుల్‌ ఫెరోజా డకౌట్‌ అవ్వగా, సిద్రా అమీన్‌ , ఒమైమా, ఆలియా సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. ఇక భారత బౌలర్లలో తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసింది. శ్రేయంకా పాటిల్ (2/6) అదరగొట్టారు. వీరితో పాటు దీప్తి శర్మ, ఆశా శోభన, రేణుకా సింగ్, చెరో వికెట్ పడగొట్టారు. పాక్ నిర్దేశించిన 106 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. 

Post a Comment

0 Comments

Close Menu