Ad Code

పోరాడుతున్న టీమిండియా : 3 వికెట్లకు 231 పరుగులు !


బెంగళూరు టెస్ట్ లో టీమిండియా పోరాడుతోంది. 356 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 3 వికెట్లకు 231 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 52 పరుగులు చేయగా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 102 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 70 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ 78 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70 పరుగులు చేసి హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. సెంచరీ దిశగా సాగిన విరాట్ కోహ్లీ.. మూడో రోజు ఆటలోని చివరి బంతికి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో ఆజాజ్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. గ్లేన్ ఫిలిప్స్ ఓ వికెట్ పడగొట్టాడు. టీమిండియా ఇంకా 125 పరుగుల వెనుకంజలో ఉంది. 180/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 స్కోర్ చేసింది. రచిన్ రవీంద్ర 134 పరుగులతో సత్తా చాటగా, టీమ్ సౌథీ 65 పరుగులతో రాణించాడు. ఈ ఇద్దరూ 8వ వికెట్‌కు 137 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రాకు ఓ వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 46 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. దాంతో న్యూజిలాండ్‌కు 356 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

Post a Comment

0 Comments

Close Menu