Ad Code

8 వికెట్ల తేడాతో టీమిండియాని ఓడించిన న్యూజిలాండ్!


బెంగళూరు టెస్టులో టీమిండియాని న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఓడించింది.  దీంతో మూడు టెస్టుల సిరీస్ లో 1-0 తేడాతో న్యూజిలాండ్ లీడింగ్ లోకి వచ్చింది. న్యూజిలాండ్ బ్యాటర్లు విల్ యంగ్, రచిన్‌ రవీంద్ర అద్భుతంగా ఆదారు. ఐదో రోజు న్యూజిలాండ్ విజయానికి 107 పరుగులు చేయాల్సి ఉండగా రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 107 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ లంచ్ బ్రేక్ ముందే స్కోర్ ను చేదించింది. విల్ యంగ్ (45 ), రచిన్ రవీంద్ర  (39) పరుగులు చేశారు. బుమ్రా రెండు వికెట్లు తీశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 46, న్యూజిలాండ్ 402 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 462 పరుగులు చేసింది. ఐదో రోజు బ్యాటింగ్ కు దిగిన కివిస్ 27.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. (76 బంతుల్లో 48 నాటౌట్ బీ 7 ఫోర్లు, 1సిక్స్), రచిన్ రవీంద్ర (46 బంతుల్లో 39 నాటౌట్ బీ 6 ఫోర్లు) కివీస్ కు విజయాన్ని కట్టబెట్టారు. వీరిద్దరూ అజేయమైన మూడవ వికెట్లకు 75 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయాన్ని సొంతం చేశారు. భారత్ రెండు వికెట్లు తీసినా, కూడా లక్ష్యం చిన్నది. ఈ తరుణంలోనే న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టడం జరిగింది. మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో కివీస్ 1-0తో విజయాన్ని అందుకుంది. ఇక మరో రెండు టెస్టుల్లో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ తలపడనున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu