Ad Code

గౌరీ లంకేష్ హత్యకేసు నిందితుడి నియామమాన్ని రద్దు చేసిన ఏక్‌నాథ్ షిండే !


ర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకేసు నిందితుడు శ్రీకాంత్ పాంగార్కర్‌ను పార్టీలోకి చేర్చుకుని ప్రచార బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వ్యక్తం కావడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆయన నియామమాన్ని రద్దు చేశారు. జల్నాలో పాంగార్కర్‌ నియమించిన అన్ని జిల్లా స్థాయి నియామకాలు కూడా చెల్లవని ఆదేశాలిచ్చారు. మాజీ శివసైనికుడు అయిన పాంగార్కర్ గత శుక్రవారంనాడు షిండే సారథ్యంలోని శివసేనలో చేరారు. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అర్జున్ ఖోట్కర్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. పాంగార్కర్ తిరిగి పార్టీలోకి చేరారని, ఆయన జల్నా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చీఫ్‌గా నియమితులయ్యారని ఈ సందర్భంగా ఖోట్కర్ ప్రకటించారు. షిండే శివసేన తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శల దుమారం చెలరేగింది. దీంతో షిండే శివసేన వెనక్కి తగ్గుతూ జల్నా జిల్లాలో ఆయనకు పార్టీ పదవి నిర్ణయాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ 2017 సెప్టెంబర్ 5న హత్యకు గురయ్యారు. లంకేష్‌ను ఆయన ఇంటి వద్ద దుండగులు కాల్చిచంపిన ఘటన తీవ్ర సంచలనమంది. మహారాష్ట్రలోని ఏజెన్సీలతో కలసి కర్ణాటక పోలీసులు కేసు విచారణ జరిపారు. పలువురు అనుమానితులను అరెస్టు చేశారు. వీరిలో జల్నా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీకాంత్ పాంగార్కర్ కూడా ఉన్నారు. ఆయన 2001-2006 మధ్య అవిభక్త శివసేనలో పనిచేశారు. లంకేష్ హత్యకేసులో 2023 సెప్టెంబర్ 4న పాంగార్కర్‌కు కర్ణాటక హైకోర్టు బెయిలు ఇచ్చింది. 2011లో ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు శివసేన నిరాకరించడంతో ఆయన హిందూ జనజాగృతి సమితిలో చేరారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరుగనుండటంతో ఆయన రెండ్రోజుల క్రితమే షిండే శివసేనలో చేరారు.

Post a Comment

0 Comments

Close Menu