Ad Code

నన్ను ఇక్కడే ఉండనీయండి : తస్లీమా నస్రీన్


బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణకు గురైన రచయిత్రి తస్లీమా నస్రీన్ తనను భారతదేశంలోనే ఉండనీయాల్సిందిగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. భారతదేశాన్ని తన రెండవ పుట్టినిల్లుగా అభివర్ణించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో 'ఎక్స్' ఒక పోస్ట్ పెట్టారు. అమిత్‌షాకు ట్యాగ్ చేశారు. తస్లీమా నస్రీన్ తన పోస్ట్‌లో అమిత్‌షాకు నమస్కారాలు తెలియజేస్తూ, భారతదేశం వంటి గొప్పదేశాన్ని తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని, గత 20 ఏళ్లుగా ఇండియా తనకు రెండో పుట్టినిల్లుగా ఉందని చెప్పారు. అయితే జూలై 2022 నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తనకు రెసిడెన్స్ పర్మిట్‌ను పొడిగించలేదని ఆవేదన వ్యక్తం చేసారు. తనను ఇక్కడే ఉండనీయాల్సిందిగా ఆభ్యర్థించారు. అందుకు తాను రుణపడి ఉంటానని ఆపోస్ట్‌లో పేర్కొన్నారు. తస్లీమా నస్రీన్ 1994 నుంచి భారత్‌లోనే ఉంటున్నారు. కమ్యూనిలిజం, మహిళల సమానత్వంపై ఆమె రాసిన రచనలు బంగ్లాదేశ్‌లోని ఇస్లాం మతఛాందసులకు కన్నెర్ర అయింది. 'లజ్జ' (1993) పేరుతో తస్లీమా రచించిన నవల, 'అమర్ మెయెబెల' (1998) పేరుతో రాసిన ఆటోబయోగ్రఫీ వివాదానికి దారితీయడంతో బంగ్లాదేశ్‌లో వాటిపై నిషేధం విధించారు. ఇస్లాం మత ఛాందసుల నుంచి బెదిరింపులు రావడంతో 1994 నుంచి భారత్‌లో తలదాచుకుంటున్నారు. దీనికి ముందు స్వీడన్, జర్మనీ, ఫ్రాన్స్ అమెరికాలో పదేళ్లు అజ్ఞాతంలో గడిపారు. ఇండియాకు వచ్చినప్పుడు కోల్‌కతాలో 2007 వరకూ ఉన్నారు. ఆ తర్వాత మూడు నెలల కోసం ఢిల్లీ వచ్చాయి. ఆమెపై భౌతికదాడి జరగడంలో గృహనిర్బంధంలో ఉన్నారు. ఆ తర్వాత 2008లో ఇండియాను విడిచిపెట్టి అమెరికా వెళ్లారు. కొన్నేళ్ల తర్వాత తిరిగి భారత్‌కు వచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu