Ad Code

డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యంత వేగంగా ఎక్కువ వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ !


భారత జట్టు బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సొంతమైదానం చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చెపాక్‌లో రెండో టెస్టు సందర్భంగా సెంచరీ (113) చేయడంతో పాటు, ఆరు వికెట్లు పడగొట్టాడు. తద్వారా టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఇదిలా ఉండగా కాన్పూర్‌ వేదికగా శుక్రవారం మొదలైన రెండో టెస్టు సందర్భంగా డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యంత వేగంగా 50 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఘనత సాధించాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో షకీబ్‌ అల్‌ హసన్‌ను అవుట్‌ చేయడం ద్వారా ఈ ఫీట్‌ నమోదు చేశాడు. తాజా సీజన్‌లో ఆడిన తొలి పది మ్యాచ్‌లలోనే ఈ రికార్డు నెలకొల్పాడు. ఇక కాన్పూర్‌ టెస్టులో టీమిండియా విజయమే లక్ష్యంగా ఐదో రోజు ఆట మొదలుపెట్టింది. రెండో ఇన్నింగ్స్‌లో 26/2 (11) ఓవర్‌నైట్‌ స్కోరుతో మొదలుపెట్టిన బంగ్లాదేశ్‌ను రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆదిలోనే దెబ్బకొట్టాడు. మొమినుల్‌ హక్‌ను అవుట్‌ చేసి శుభారంభం అందించాడు. ఆకాశ్‌ దీప్‌ షాద్‌మన్‌ ఇస్లాం, రవీంద్ర జడేజా నజ్ముల్‌ షాంటో, లిటన్‌ దాస్‌, షకీబ్‌ అల్‌ హసన్‌ వికెట్లు కూల్చారు. దీంతో వందలోపు(94) పరుగులకే బంగ్లా ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

Post a Comment

0 Comments

Close Menu