Ad Code

ఠాగూర్ సినిమాలోని ఆసుపత్రి సన్నివేశం రోగులలో అపనమ్మకాన్ని పెంచింది : డాక్టర్ గురువారెడ్డి


ఠాగూర్ సినిమాలోని ఆసుపత్రి సన్నివేశం వైద్యులకు కంటిమీద కునుకు పట్టనీకుండా చేసిందని  ప్రముఖ వైద్యులు, కిమ్స్- సన్ షైన్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ గురువారెడ్డి అన్నారు. ఇది ఆరోగ్య సంరక్షణ రంగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసిందని, వైద్యులను విమర్శిస్తూ రోగులలో అపనమ్మకాన్ని పెంచిందన్నారు. ``అలాంటి సన్నివేశాన్ని రాసి రచయితలు చాలా హాని చేశారు. ఈ తరహా వర్ణన వల్ల వైద్యులను ఎవరూ నమ్మని పరిస్థితి ఏర్పడింది. కొద్ది శాతం మంది వైద్యులు అనైతికంగా ప్రవర్తించి రోగులను దోపిడి చేస్తారనేది నిజమే అయినా సినిమాలో ఈ అంశాలను అతిశయోక్తిగా చూపించారు`` అని డాక్టర్ గురువారెడ్డి చెప్పారు. ``ఇప్పుడున్న ఒత్తిళ్లతో కూడుకున్న పరిస్థితులలో మా వృత్తిలో ఒక రోజు అనుభవం గడించమని నేను సినిమా రచయితలను సవాల్‌ చేస్తున్నాను. ఎవరూ ఒక్కరోజు కూడా ఉండలేరు. మేం కృతజ్ఞత పొందలేని ఉద్యోగాలు చేస్తాము``అన్నారాయన. చిరంజీవి ఇంటికి చాలాసార్లు అతిథిగా వెళ్లానని చెప్పారు. ఠాగూర్‌లోని సన్నివేశం వైద్య నిపుణుల మనశ్శాంతికి ఎలా భంగం కలిగించిందనే దాని గురించి చిరంజీవితో తన భావాలను పంచుకున్నానని తెలిపారు. ఆ సన్నివేశాన్ని నిజానికి మరింత విపరీతంగా చిత్రీకరించినా మా అభ్యర్థన మేరకు చిరంజీవి సూచనతో సినిమాలో టోన్ తగ్గించారని తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu