Ad Code

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఒమర్‌ అబ్దుల్లా ఎన్నిక !


నేషనల్‌ కాన్ఫరెన్స్ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఒమర్‌ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీగుఫ్వారా బిజ్‌బెహర్‌ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే బషీర్‌ వీరే ఈ విషయాన్ని వెల్లడించారు. ఒమర్ అబ్దుల్లాను సీఎం పదవికి ఎన్నుకోవడం తమకు ఎమోషన్‌ మూమెంట్‌ అని మరో నేత సల్మాన్‌ సాగర్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామన్నారు. జమ్మూ కశ్మీర్‌కు బలమైన, శక్తివంతమైన నాయకత్వం అవసరమని.. ఒమర్‌ అబ్దుల్లా కంటే గొప్పవారు ఎవరూ ఉండరని తానుకోవడం లేదని హస్నైన్‌ మసూది పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్టికల్‌ 370 పునరుద్ధరణకు కృషి చేస్తామన్నారు. ఎన్‌సీ తన పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేస్తామన్నారు. ఫరూక్ అహ్మద్ షా మాట్లాడుతూ ప్రజలు నేషనల్‌ కాన్ఫరెన్స్‌పై విశ్వాసం చూపించారన్నారు. 2019 ఆగస్టులో తొలగించిన హక్కుల కోసం నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పోరాటం కొనసాగుతుందన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై దృష్టి పెడతామని జావేద్‌ బేగ్‌ పేర్కొన్నారు. ప్రజలు ఎన్‌సీకి ఓటు వేసి.. 2019 నాటి బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టంగా తిరస్కరించారన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని ప్రతి అంశాన్ని బీజేపీ నిర్లక్ష్యం చేసిందని, ప్రజలు వారిని ఓటుతో ఓడించారన్నారు.


Post a Comment

0 Comments

Close Menu