Ad Code

వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో ఎన్నికలు ?


బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు తాత్కాలిక ప్రభుత్వం సలహాదారు డాక్టర్ అసిఫ్ నజ్రుల్ స్పందించారు. ''వచ్చే ఏడాది ఎన్నికలు జరగొచ్చు. ప్రస్తుతానికి ఇది నా ప్రాథమిక అంచనా మాత్రమే. వీటి నిర్వహణ విషయంలో ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి. ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితా తయారీ వంటి పనులు పూర్తి చేయాలి. బంగ్లా ప్రభుత్వ తాత్కాలిక సారథి నేతృత్వంలో ఈ ఎన్నికల తేదీపై నిర్ణయం ఉంటుంది. దాని గురించి ఆయనే ప్రకటన చేస్తారు'' అని తెలిపారు. రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో అప్పటి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆందోళనలు తీవ్రంగా ఉండటంతో ఆమె దేశం విడిచి, భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఆమె రాజీనామాతో బంగ్లాలో అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయింది. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది.

Post a Comment

0 Comments

Close Menu