Ad Code

మహారాష్ట్రలో బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదల !


హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గాను బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రకటించింది. ఈ లిస్టులో 99 మంది పేర్లను ఖరారు చేసింది. నాగ్ పూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ బరిలోకి దిగనున్నారు. ఈ స్థానం బీజేపీకి కంచుకోటగా ఉంది. అలాగే బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్ భోకర్ స్థానం నుంచి అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు. అంతేగాక మొదటి జాబితాలో మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే, మంత్రులు గిరీష్ మహాజన్, సుధీర్ ముంగంటివార్, అతుల్ సేవ్ వంటి ప్రముఖులకు కూడా అవకాశం దక్కింది. బవాన్కులే కమ్తీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయనున్నారు. కొలాబా నుంచి అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్, కంకావలి నుంచి నితీశ్ రాణేకు టికెట్ దక్కింది. 

Post a Comment

0 Comments

Close Menu