Ad Code

యువ రైతు రాత మార్చిన కలబంద సాగు !


హారాష్ట్రలోని కరువు పీడిత సతారా జిల్లాలోని రైతులు సాగునీటి కోసం ఎక్కువగా వర్షపునీటిపైనే ఆధారపడుతుంటారు. ఈ క్రమంలో పంటలు పూర్తిగా ప్రకృతిపైనే ఆదారపడి ఉన్నాయి. ఒక వ్యాపారవేత్త ఇచ్చిన సలహాతో ఈ గ్రామానికి చెందిన అనేక మంది రైతులు కలబంద సాగుకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన హృషికేష్‌కు బదలి గ్రామంలో 8 ఎకరాల భూమి ఉంది. అతని కుటుంబం సాంప్రదాయకంగా వరి, మినుము, మొక్కజొన్న, గోధుమ వంటి పంటలను సాగుచేసేది. అయితే పొడి ప్రాంతం కావడంతో ఇక్కడ సాగు చేసే పంటలు వర్షపు నీటిపైనే ఎక్కువగా ఆధారపడి ఉండేది. ఇతర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకునే సౌకర్యం లేదు. దీంతో వారి పంటలు ఎండిపోయేవి. నలుగురితో కూడిన కుటుంబం హృషికేష్ తండ్రి నెలవారీ జీతం రూ.2,000పై పూర్తిగా ఆధారపడి ఉంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో నాసిరకం చపాతీలు, అప్పుడప్పుడు కూరగాయలతో బతుకుసాగిస్తూ వచ్చారు. హృషీకేశ్ ఎప్పుడూ చెప్పులు కూడా ధరించలేదు. 20 ఏళ్ల వయస్సులో కుటుంబానికి సహాయంగా నిలిచేందుకు, తన ఉన్నత విద్యకు మద్దతు కోసం ఒక మార్కెటింగ్ కంపెనీలో పనికి చేరాడు. అయితే కంపెనీ సేల్స్ డిపార్ట్‌మెంట్‌లో లక్ష టార్గెట్‌ను చేరుకుంటే నెలకు రూ.3500 అందించేది. ఈ ఉద్యోగంలో ఆదాయం స్థిరంగా లేనప్పటికీ దాదాపు నాలుగు నెలల పాటు అందులో కొనసాగాడు. ఉద్యోగం ఇబ్బందిగా మారటంతో స్వగ్రామంలో ఏదైనా వ్యాపారం చేసుకుందామని ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ సమయంలోనే మునగ, బొప్పాయి కొనుగోలు, విక్రయానికి నర్సరీని ప్రారంభించాడు. అలా అదే సమయంలో ఎరువుల వ్యాపారాన్ని సైతం క్రమంగా ప్రారంభించాడు. ఈ క్రమంలోనే హృషీకేశ్ మామిడి, జామకాయ చెట్ల మధ్య 4000 కలబంద మొక్కలను నాటాడు. కలబంద మొక్కకు చెదపురుగులను తరిమికొట్టే శక్తి ఉంది. దీంతో తన పొలానికి ఎలాంటి నష్టం వాటిల్లదని భావించి మామిడి చెట్లకు రక్షణగా ఉంటుందని ఈ పని చేశాడు. హృషికేష్‌ హార్టికల్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు. సతారాలో ఏర్పాటు చేసిన ఫెయిర్‌లో కలబంద ఉత్పత్తులను విక్రయిస్తున్న పారిశ్రామికవేత్తను చూసి సబ్బులు, షాంపూలు, కలబంద రసం వంటి ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించాడు. ఇది పెద్దగా రాబడిని అందించకపోవటంతో కలబందను ఉపయోగించి మొక్కల పెరుగుదలకు సహజమైన పురుగుమందులు, ఎరువులను తయారు చేశాడు. సహజంగా అరటి ఆకులకు నీరు రాస్తే అవి ఆకుపై నిలవవు. ఈ విషయం తెలిసి అలోవెరా స్ప్రెడర్‌ని తయారు చేశాడు. దీన్ని పిచికారీ చేయడం వల్ల పురుగులు దూరంగా ఉంటాయి. 2013లో స్నేహితుల సహకారంతో హృషికేష్ తన ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం ప్రారంభించాడు. ప్రస్తుతం అతను ఫామ్ నుండి సగటున 8000 లీటర్ను ఉత్పత్తి చేస్తున్నాడు. రెండు ఎకరాల భూమిలో కలబంద సాగుతో ఏడాదికి రూ.3.5 కోట్ల టర్నోవర్ సాధించాడు. ఇందులో దాదాపు 30 శాతం రాబడిగా అందుకున్నాడు. సహజంగా అందరూ కలబంద నుంచి చర్మసౌందర్యానికి వాడే ఉత్పత్తులకు బదులుగా పురుగుల మందలు తయారు చేసి గొప్పవిజయం సాధించాడు. అనేక కష్టాలను ఎదుర్కొన్న ఈ యువ రైతు ప్రయాణం అనేక ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ ప్రస్తుతం చాలా మందికి స్పూర్తిదాయకంగా మారింది.

Post a Comment

0 Comments

Close Menu