Ad Code

గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో హాకీ తొలగింపు ?


2026 జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో హాకీని తొలగిస్తారని వార్తలొస్తున్నాయి. నాలుగేళ్లకొసారి జరిగే కామన్వెల్త్‌ క్రీడలు ఈ సారి స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో జరగనున్నాయి. వచ్చే ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 2 వరకు ఈ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. త్వరలోనే షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. తొలుత ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో ఈ క్రీడలను నిర్వహించాలనుకున్నారు. అయితే, పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఆతిథ్యమివ్వడానికి విక్టోరియా విముఖత చూపింది. దీంతో టోర్నీ నిర్వహణకు స్కాట్లాండ్ ముందుకొచ్చింది. 2022 కామన్వెల్త్ క్రీడల్లో (బర్మింగ్‌హామ్) 19 ఈవెంట్‌లను నిర్వహించారు. అయితే, ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఈ సారి 10 ఈవెంట్‌లను మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హాకీ, నెట్‌ బాల్, రోడ్‌ రేసింగ్‌తోపాటు మరో ఆరు ఈవెంట్‌లను తొలగిస్తారని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. హాకీని తొలగిస్తే భారత్‌కు పెద్దదెబ్బ తగిలినట్లే. కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల హాకీ జట్టు మూడుసార్లు రజతం, రెండుసార్లు కాంస్య పతకాన్ని సాధించింది. 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలున్నాయి. రెజ్లింగ్‌లో అత్యధికంగా 12 పతకాలు రాగా.. వెయిట్ లిప్టింగ్‌లో 10 పతకాలు వచ్చాయి.

Post a Comment

0 Comments

Close Menu